మామూలుగా హీరో హీరోయిన్లకు అభిమానులు ఉండడం అన్నది కావాలి.అభిమానులు సెలబ్రిటీలపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
వాళ్ళ ఫోటోలు లేదంటే పేర్లు టాటూలు వేయించుకోవడం, వారి పేరు మీద అన్నదానం రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేయడం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.గతంలో చాలామంది వివిధ రకాలుగా అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియా( Social media )లో నిలిచిన విషయం తెలిసిందే.

తాజాగా ఎన్టీఆర్ అభిమాని చేసిన పని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఎన్టీఆర్( JR ntr ) పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు ఒక అభిమాని.కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన ఎన్టీఆర్ అభిమాని ప్రతి ఇటుక మీద ఎన్టీఆర్ అనే పేరు వచ్చేలా తయారు చేయించాడు.బట్టీ కార్మికులకు చెప్పి ఎన్టీఆర్ పేరు అచ్చుతో ఇటుకలను రూపొందించాడు.
తన ఇంటికి వాడిని ప్రతి ఇటుక మీద ఎన్టీఆర్ పేరు ఉండాలని అతడు కోరుకున్నాడట.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సదరు వ్యక్తి అభిమానానికి ఆశ్చర్యపోతున్నారు.

ఇది కదా ఎన్టీఆర్ అంటే అంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కొందరు నువ్వు సూపర్ బ్రో నువ్వు కేక బ్రో అంటూ అతనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఎన్టీఆర్ విషయానికి వస్తే… ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర( Devara ) సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.మొన్నటి వరకు హైదరాబాదులో షూటింగ్ జరిపిన చిత్ర బృందం ఇటీవలే గోవాకు వెళ్లారు.అనంతరం వైజాగ్ తో పాటు మరికొన్ని తీరా ప్రాంతాల్లో షూటింగ్ జరగనుందని సమాచారం.ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు ఎన్టీఆర్.