Dog viral : పక్షితో కుక్క స్నేహం.. దానిని మింగేస్తోందని పాముతో ప్రాణాలకు తెగించి పోరాటం..

యజమానులతో పాటు వారు పెంచుకునే ఇతర జంతువులను కూడా కుక్కలు కంటికి రెప్పలా కాపాడుతుంటాయి.అవసరమైతే తమ ప్రాణాలను సైతం వదిలేసేందుకు ఇవి సిద్ధమవుతాయి.

కాగా ఇదే విషయాన్ని నిరూపిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఒక కుక్క తన యజమాని పెంచుకునే చిలుక ప్రాణాలు కాపాడేందుకు అత్యంత ప్రమాదకరమైన ఒక పాముతో పోరాడింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పంజరంలో చిలుక ఉండటం చూడవచ్చు.చాలా పొడవుగా ఉన్న ఒక పాము ఈ పంజరంలోకి దూసుకెళ్లడం గమనించవచ్చు.

ఆ పామును చిలుకను పట్టుకోడానికి ప్రయత్నించింది.ఇంతలోనే ఒక కుక్క అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది.

Advertisement

అనంతరం పాము తోకను నోట పట్టుకొని చిలుకను కాపాడేందుకు ప్రయత్నించింది.వెంటనే అప్రమత్తమైన పాము ఆ పంజరం నుంచి బయటకు వచ్చింది.

అప్పుడు కుక్క ఆ పాము మెడ భాగంలో కరిచింది.అనంతరం దాన్ని గట్టిగా తన నోటితో పట్టుకొని చంపడానికి ప్రయత్నించింది.

ఈ క్రమంలో పాము కుక్కను కాటేసినట్లు కూడా కనిపించింది.ఆ తర్వాత పాముని పట్టుకొని కుక్క అక్కడ నుంచి వేరే వైపుకు వెళ్ళిపోయింది.

ఇంతటితో వీడియో ముగిసింది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
వెక్కి వెక్కి ఏడ్చిన ఫుట్ బాల్ దిగ్గజం.. వైరల్ వీడియో

యజమాని పెంచుకునే చిలుకతో కుక్క స్నేహం పెంచుకుందని, అందుకే ఇది దానిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిందని నెటిజనులు దాన్ని పొగుడుతున్నారు.కొందరు మాత్రం పాము కాటుకు గురైన కుక్క చనిపోయి ఉంటుందా? ఆ పాము విషపూరితమైనదైనా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ పాము విషపూరితమైనది ఐతే కుక్క చనిపోయే ఉంటుంది.

Advertisement

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

తాజా వార్తలు