Nagarjuna Baladitya : సిగరెట్ కోసం బాలాదిత్య ఆ మాటలు మాట్లాడాడ? గుండె పగిలిందంటూ గీతూ సీన్?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రోజుకి రసవత్తరంగా మారుతూ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.కాగా బిగ్ బాస్ హౌస్ లో గీతూ ప్రవర్తన గురించి గీతూ మాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గీతూ బిగ్ బాస్ హౌస్ లో ఏ బంధం అయినా తనకు ఆట తర్వాతే అని చెప్పిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా భుజబలంతో పాటు బుద్ధి బలం కూడా వాడొచ్చు అన్న ఒక్క పాయింట్ తో గేమ్ లో రకరకాల మలుపులు తిప్పింది.

ఈ క్రమంలోనే గీతూ మొదట బాలాదిత్యా వీక్ నెస్ అయిన సిగరెట్ల పై దాడి చేసి అతని హింసించి ఆఖరికి ఏడిపించేసింది గీతూ.

తాజాగా శనివారం కావడంతో నాగార్జున కంటెస్టెంట్స్ కు వార్నింగ్ ఇస్తూ గీతూ, బాలాదిత్యా మధ్య జరిగిన గొడవ గురించి లేవనెత్తాడు.

మొదట బ్లూ టీం లీడర్ అయినా ఆదిరెడ్డి ని తన టీమ్ మెంబర్స్ కి ర్యాంకులు ఇవ్వమని చెప్పాడు నాగ్.అప్పుడు బాలాదిత్యా కు ఆదిరెడ్డి ఐదవ నెంబర్ ర్యాంక్ ఇవ్వగా వెంటనే నాగార్జున నీకు వేసిన నెంబర్ కూడా సిగ్గుతో వెనక్కి తిరిగింది అంటూ బాలాదిత్య పరువు తీసేసాడు.

సిగ్గుండాలి, మనిషివేనా, ప్రేమతో ఆడుకుంటావా? ఇంగిత జ్ఞానం ఉందా?… ఆఫ్టరాల్‌ సిగరెట్‌ కోసం ఇన్ని మాటలు అనాలా? అని అడిగాడు నాగ్‌.

అవన్నీ కోపంలో అనలేదని, బాధతో అలా మాట్లాడానని తెలిపాడు బాలాదిత్య.అప్పుడు గీతు ఎన్ని మాటలు అన్నా ఫీల్ అవ్వలేదని కానీ ఇన్ని రోజులు నువ్వు నటిస్తున్నానంటే నేను నమ్మలేదు ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది అన్న ఒక్క మాటకు నా గుండె ముక్కలు అయింది సార్ అని నాగార్జునకు తెలిపింది.అప్పుడు గీతూ ని అడుగుతూ ఆటలో సిగరెట్ లు దాచడం వరకు కరెక్టే కానీ ఆట అయిపోయిన తర్వాత కూడా అతని బలహీనలతో ఆడుకోవడం తప్పు అని అంటాడు నాగార్జున.

అప్పుడు గీతూ అవును అంటూ తల ఊపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube