సాధారణంగా నాలుగు కాళ్ల జంతువులు అన్నీ కూడా ముందు కాళ్లపై నడుస్తుంటాయి.అవి కేవలం వెనుక కాళ్లపై నిల్చొని ఎక్కువసేపు నడవలేవు.
నిజానికి మానవులు లాగా నడిచే సామర్థ్యం వాటికి ఉండదు.ముఖ్యంగా బ్యాలెన్స్ నిలుపుకోవడం లో అవి బాగా కష్ట పడు తుంటాయి.
అయితే ఒక కుక్క మాత్రం అన్ని శునకాలకు భిన్నంగా మనిషి లాగా నడుస్తూ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
ఆ కుక్క పేరు డెక్స్‌టర్.
దీనికి సుమారు ఆరేళ్ల వయసుంటుంది.ఒక రోడ్డు ప్రమాదంలో ఇది ముందు కాళ్లలోని కుడి కాలును శాశ్వతంగా కోల్పోయింది.
అప్పట్నుంచి డెక్స్‌టర్ 3 కాళ్ళతోనే నడుస్తూ చాలా ఇబ్బంది పడిపోయింది.ఆ తర్వాత మెల్ల మెల్లగా కేవలం తన వెనుక కాళ్లపై నడవటం అలవాటు చేసుకుంది.
అభ్యాసం కూసు విద్య అన్న చందాన ఇది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అలవోకగా మనిషిలా నడిచే నైపుణ్యాన్ని సొంతం చేసుకుంది.
కొలరాడో రాష్ట్రంలోని ఓరేకి చందిన కెంటీ పాసెక్ అనే ఒక వ్యక్తి ఈ కుక్కని పెంచుకుంటున్నారు.ఈ శునకాన్ని చిన్నతనం నుంచే కెంటీ పెంచుకుంటున్నారు.అయితే కుక్కను వెంట బెట్టుకొని ఒకరోజు వెట్ టౌన్‌కి కారులో వెళ్లారు.
ఈ 45 నిమిషాల జర్నీ లో కార్ కి యాక్సిడెంట్ జరిగింది.ఆ రోడ్డు ప్రమాదంలో కుక్క కాలు పూర్తిగా దెబ్బతింది.
దాంతో సర్జరీ చేసి దానిని తొలగించారు డాక్టర్లు.అప్పటి నుంచి మెల్లమెల్లగా కోలుకుంది.
ఆ తర్వాత వెనక ఉన్న రెండు కాళ్లతో నడవడం ప్రారంభించింది.ఈ వీడియోని యజమాని సోషల్ మాధ్యమాల్లో షేర్ చేశారు.
అది కాస్తా వైరల్ గా మారింది.ఈ వీడియోలో డెక్స్‌టర్ డాగ్ కిచెన్ లో మనిషిలాగా నిల్చొని ఉండటం చూడవచ్చు.
యజమాని పిలవగానే అది రెండు కాళ్లపై చకచకా నడుస్తూ రావడం కూడా గమనించవచ్చు.ఈ వీడియో చూసి జంతు ప్రేమికులు ఫీదా అవుతున్నారు.
పెను విషాదం నుంచి మళ్ళీ తేరుకొని ఆత్మస్థైర్యంతో ఈ కుక్క సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న తీరు అందర్నీ ఆనందపరుస్తోంది.మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్ వెయ్యండి.