నీటిలో ఈత కొడుతూ షెల్టర్ కనుగొన్న కుక్క.. వీడియో వైరల్..

చలికాలంలో ఊహించని విధంగా కురిసిన కుండ పోత వర్షాల వల్ల మన తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు కూడా బాగా ప్రభావితం అయింది.సాధారణంగా వరదలు ముంచెత్తినప్పుడు మనుషులకంటే మూగజీవుల ఎక్కువగా ప్రభావితం అవుతాయి.

 A Dog Found By A Shelter While Swimming In Water Video Goes Viral , Dog, Viral-TeluguStop.com

మనుషులను కాపాడేందుకు ఎవరో ఒకరు వస్తారు.రెడ్ అలర్ట్ చారి చేసి మనుషులను ముందుగానే ఖాళీ చేస్తారు కానీ మూగజీవుల పట్ల ఇలాంటి కేరింగ్ ఏదీ ఉండదు.

దీనివల్ల అవి వరదలు చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తాయి.ఇలాంటి సమయాల్లో కొందరు వాటి పట్ల దయ తలిచి కాపాడుతుంటారు.

ఎవరూ కాపాడినప్పుడు జీవులే ధైర్యం చేసి అందుకు సాగుతూ ఎలాగోలా బతికిపోతాయి.తాజాగా అలాంటి ఒక బ్రేవ్ డాగ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ( Social media )వైరల్‌గా మారింది.

కుక్క( Dog ) తన ఫ్రెండ్‌తో యూనిట్ అయ్యేందుకు చెన్నైలోని వరదల్లో ఈత కొడుతూ కెమెరాకి చిక్కింది.ఈ కుక్క హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అరుంబాక్కం ప్రాంతంలో ఈ కుక్క నీరు నిండిన రహదారిని ధైర్యంగా దాటుతూ అవతలి వైపుకు చేరుకుంది, అక్కడ మరొక కుక్క దాని కోసం వేచి ఉంది.రెండు కుక్కలు వరదనీటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని మెట్లు ఎక్కాయి.

కుక్క ఆశ్రయం కోసం వెతుకుతోంది అనే క్యాప్షన్‌తో పాటు, ఈ వీడియోను వార్తా సంస్థ ANI ఎక్స్‌లో షేర్ చేసింది.

మరో వీడియోలో( Viral video ) కొందరు జంతు ప్రేమికులు చెన్నైలోని వరద బాధిత ప్రాంతాల నుంచి వీధి కుక్కలను రక్షించారు.వీధుల్లోంచి కుక్కలను ఎత్తుకెళ్లి ట్రక్కులో ఎక్కించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.

ఈ నెల ప్రారంభంలో నగరాన్ని తాకిన మైచాంగ్ తుఫాను ప్రభావంతో చెన్నై భారీ వర్షాలను ఎదుర్కొంటోంది.తుఫాను కారణంగా నగరంలో విస్తృతమైన నష్టం, అంతరాయం ఏర్పడింది.

గ్రేటర్ చెన్నై పోలీసు పరిధిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.పరిస్థితిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి సహాయం, మధ్యంతర సహాయం కోరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube