సాధారణంగా డిగ్రీ లేకపోతే పైసాకి కూడా పనికిరారు అనే ఒక భావన ఇండియన్ పేరెంట్స్ లో ఉంటుంది.అయితే డబ్బులు సంపాదించడానికి డిగ్రీ అవసరం లేదని చాలామంది నిరూపించారు డిగ్రీ( Degree ) చేసిన వారి కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ కూడా కొందరు ఆశ్చర్యపరిచారు.తాజాగా డిగ్రీ పూర్తి చేయని ఒక మహిళ ఏటా ఏకంగా రూ.58 లక్షలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.అంటే నెలకు సుమారు రూ.5 లక్షలు.డబ్బు పరంగా చూసుకుంటే ఐఏఎస్ శాలరీల కంటే ఈమె ఎక్కువ సంపాదిస్తుందని చెప్పుకోవచ్చు.ఇంతకీ ఆమె ఎవరు? ఏ పని చేస్తూ ఇంత మొత్తంలో శాలరీ అందుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్లోవేకియా దేశంలో( Slovakia ) చాలా పేద కుటుంబంలో పుట్టిన డయానా టకాసోవా( Diana Takacsova ) అనే 34 ఏళ్ల మహిళ యూకేకు షిఫ్ట్ అయిన తర్వాత జీవితమే మారిపోయింది.ఆమె యుక్త వయసులో ఆర్థిక ఇబ్బందులను ఎన్నో ఎదుర్కొంది.
కానీ ఏనాడు కృంగిపోలేదు ఏదో ఒక రోజు డబ్బు సమస్యలు లేకుండా అతను బతకగలనని బాగా నమ్మింది.ఏ మహిళ కూడా చేయని ధైర్యం ఆమె చేసింది.
యూకే కి వచ్చాక ఫ్యూయల్ ట్యాంక్ డ్రైవర్‌గా( Fuel Tank Driver ) ఆమె కెరీర్‌ను ఎంచుకుంది.డయానా సంకల్పం, దేనికైనా అడ్జస్ట్ కాగల సామర్థ్యంతో సక్సెస్ సాధించింది.
మొదట పొలాల్లో పెద్ద యంత్రాలు నడుపుతూ డ్రైవింగ్ పట్ల మక్కువ పెంచుకుంది.
19 ఏళ్ళ వయసులో, డయానా రెండు A-లెవెల్‌కు సమానమైన వాటిని సాధించింది, కానీ ఆమె 21 సంవత్సరాల వయస్సులో తల్లి అయినప్పుడు విద్యను నిలిపివేసింది.ఆ విధంగా ఆమె డిగ్రీ చదవకుండా ఆపేయడం జరిగింది.వ్యక్తిగత ఎదురుదెబ్బ తర్వాత 2014లో యూకేకి( UK ) మకాం మార్చింది, ఆపై హీత్రో విమానాశ్రయం సమీపంలోని సర్కిల్ ఎక్స్‌ప్రెస్‌లో ఫోర్క్‌లిఫ్ట్ ట్రక్ డ్రైవింగ్ జాబ్ పొందింది.
మగవారి కంటే బాగా పని చేస్తూ సూపర్‌వైజర్‌గా( Supervisor ) పదోన్నతి పొందింది.కానీ హాయిగా ఆఫీసులో కూర్చుని డబ్బు సంపాదించగలిగే జాబ్ చేయాలని ఆమె కోరుకుంది కానీ ఆ జాబ్ లో సంతృప్తి పొందలేదు.
అందుకే మళ్ళీ డ్రైవింగ్ రంగంలో కంటిన్యూ అయ్యింది.
డయానా క్లాస్ 2, CPC లైసెన్సులను సంపాదించగలిగింది.దాని తర్వాత క్లాస్ 1 లైసెన్సు పొందింది.3వ తరగతి ఇంధన ట్యాంకర్‌లలో ADR, పెట్రోలియం డ్రైవర్ పాస్‌పోర్ట్‌తో ఆమె అర్హతలు విస్తరించాయి.చివరికి ఫ్యూయల్ ట్యాంక్ డ్రైవ్ చేయగల అనుమతి ఆమెకు లభించింది.ఇప్పుడు, డయానా ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో ఇంధనాన్ని అందిస్తుంది, సాంప్రదాయకంగా పురుష-ఆధిపత్య రంగంలో ఉన్న సవాళ్లను ఆమె స్వీకరించింది.
ఆమె ఈ పరిశ్రమలోని అవకాశాలను హైలైట్ చేస్తూ లాజిస్టిక్స్‌లో మహిళలకు ఇది ఒక దారి చూపించింది.జనరేషన్ లాజిస్టిక్స్‌కు అంబాసిడర్‌గా, డయానా ఈ రంగాన్ని చాంపియన్‌గా చేస్తుంది.
లింగం లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా ఇతరులను వారి ఆకాంక్షలను కొనసాగించమని ప్రోత్సహిస్తుంది.ఆమె పాత్రలో, డయానా అదనపు బోనస్‌లు, ఓవర్‌టైమ్ అవకాశాలతో పాటు 55,000 పౌండ్ల జీతం పొందుతుంది.
ఈ అమౌంట్ చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు.