రంగారెడ్డి జిల్లా మణికొండలో( Manikonda ) ఓ కారులో మృతదేహం( Dead Body ) కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు( Narsingi Police ) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు హత్యా.? లేక బలవన్మరణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే మృతుడు మణికొండకు చెందిన రమేశ్ గా( Ramesh ) పోలీసులు గుర్తించారు.శనివారం ఆయన తన స్నేహితులు శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్ తో కలిసి యాదగిరి గుట్టకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తిరిగి వస్తున్న సమయంలో పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ సమీపంలో పెట్రోల్ అయిపోవడంతో కారు ఆగిపోయిందని, దాంతో రమేశ్ స్నేహితులు శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం.అలాగే యాదగిరి గుట్టకు( Yadagirigutta ) వెళ్లిన సమయంలో ముగ్గురు మద్యం సేవించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఈ నేపథ్యంలో స్నేహితుల మధ్య ఏదైనా వివాదం జరిగి రమేశ్ హత్యకు గురయ్యాడా? లేక బలవన్మరణానికి పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.