బంతి లాగానే మారిపోయిన జీవి.. ఎలా ఓపెన్ అవుతుందో చూడండి..

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి వైరల్ అయ్యే వీడియోలు మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి కొన్ని వీడియోలు ఆశ్చర్యపరిస్తే మరికొన్ని షాక్‌కు గురిచేస్తాయి.తాజాగా అలాంటి మరో వీడియో వైరల్ గా మారింది.

 A Creature That Has Changed Like A Ball See How It Opens Up, Viral News, Latest-TeluguStop.com

దీనిని ప్రముఖ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి ఇప్పటిదాకా దీనికి 16 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే, బోడిపెలు ఉన్న ఒక బాల్ లాగా కనిపించింది.కొద్ది సెకన్ల తర్వాత అది ఒకసారిగా విప్పుకోవడం ప్రారంభించింది.

ఇది చూస్తుంటే ఒక హారర్ మూవీలో ఏదో వింత జంతువు ఒక రాయి లాగా ఉండి, ఆపై అది కదలడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది.లేదంటే ఒక కొబ్బరి చిప్ప లాగా ఉండిపోయింది.

ఒక వ్యక్తి దీనిని చేతిలో పట్టుకొని మనకి చూపించడం చూడవచ్చు.తర్వాత రాయి లాగా ఉన్న ఆ రూపం నుంచి ఒక జీవి బయటపడింది.

ఆ క్షీరధం పేరు అర్మడిల్లోస్( Armadillos ).

అమెరికాకు ( america )చెందిన ఇవి చర్మంలో అస్థి పలకలతో జీవించే ఏకైక క్షీరదాలు, ఇవి వాటికి విలక్షణమైన సాయుధ రూపాన్ని అందిస్తాయి.ఒక ఆర్మర్‌ లాంటిది ఇవి ధరించి యుద్ధానికి సిద్ధమన్నట్లు ఉంటాయి.అర్మడిల్లోస్ పొడవైన, జిగట నాలుకను కూడా కలిగి ఉంటాయి.

ఆ నాలుకతో చీమలు, చెదపురుగులను( Ants , termites ) పట్టుకుంటాయి.చిన్న పింక్ ఫెయిరీ అర్మడిల్లోస్ నుండి 5 అడుగుల పొడవు, 100 పౌండ్ల వరకు బరువు ఉండే జెయింట్ అర్మడిల్లోస్ వరకు 20 రకాల అర్మడిల్లోలు ఈ ప్రపంచంలో ఉన్నాయి.

అర్మడిల్లోస్ శ్వాస తీసుకోకుండా ఆరు నిమిషాల వరకు ఉండగలవు.ఇవి చాలా వేగంగా అద్భుతంగా ఈత కూడా ఈదగలవు.

ఇక వైరల్ అవుతున్న వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube