మనుషులు కోతుల నుంచి వచ్చారని డార్విన్ తన జీవ పరిణామ క్రమ సిద్ధాంతంలో పేర్కొన్నారు.దీనిని కొందరు కొట్టి పారేస్తారు.
అయితే మనుషులు చేసే కొన్ని పనులు కోతులు, చింపాంజీలు( Chimpanzee ) చేస్తుండడం చూసి అంతా ఆశ్చర్యపోతుంటారు.ఏదైనా పండ్లు తినే ముందు చాలా మంది కడుక్కుని తింటుంటారు.
ఇదే కోవలో ఓ చింపాంజీ కూడా చేసిన వీడియో కొన్నాళ్ల క్రితం వైరల్ అయింది.ఇదే కాకుండా నీళ్లంటే( Water ) భయపడే కొందరు మనుషులు ఉంటారు.
ఏ మాత్రం చెరువులు, నదులు, కాలువలు కనిపిస్తే కళ్లు మూసుకుంటారు.ఇలాంటి భయమే ఓ చింపాంజీకి కూడా వచ్చింది.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భయం ఉంటుంది.కొందరికి చీకటి, ఇంకొందరికి దెయ్యాలు, మరికొందరికి పాములు ఇలా ఫోబియాలు ఉంటాయి.అయితే ఓ చింపాంజీకి నీళ్లంటే భయం.ఓ సరస్సులోకి చింపాంజీ దిగేందుకు భయపడింది.దీనికి సంబంధించిన వీడియోను safari_wild7 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా( Instagram )లో పోస్ట్ చేశారు.
ఆ వీడియోను పరిశీలిస్తే ఆ చింపాంజీకి నీళ్లంటే భయం ఉందని స్పష్టం అవుతోంది.ముఖ్యంగా నీటిలోకి దిగేందుకు ఆ చింపాంజీ ఓ క్లాత్ పట్టుకుని జాగ్రత్త పడింది.
ఎక్కడ జారి పడి ఆ నీటిలో పడిపోతానో అని ఆ చింపాంజీ చాలా భయపడింది.

ఆ చింపాంజీకి కాళ్లకు, చేతులకు బురద అంటుకుంటుంది.వాటిని శుభ్రం చేసుకోవాలని అది భావించింది.దీంతో ఆ నీటి కుంటలోకి పడకుండా ఉండేందుకు ఓ క్లాత్ సాయం తీసుకుంది.
ఆ క్లాత్ ఓ చెట్టు మొదలుకు గట్టిగా కట్టింది.దానిని పట్టుకుని చాలా జాగ్రత్తగా నీటిలో తన కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంది.
దాని తెలివికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.అదే సమయంలో నీళ్లంటే దానికి ఉన్న భయం చూసి నవ్వుకుంటున్నారు.







