జాతీయ రాజకీయాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్( Congress ) మరియు బీజేపీ( BJP ) మద్య ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే.చాలానే పార్టీలు ఉన్నప్పటికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ రెండే జాతీయ రాజకీయాలను శాసిస్తున్నాయి.అయితే ఈ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా థర్డ్ ఫ్రంట్ కు అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఎందుకంటే అటు ఎన్డీయే కూటమిలో గాని ఇటు ఇండియా కూటమిలోగాని లేని పార్టీలు చాలానే ఉన్నాయి.
ఆ పార్టీలన్నీ కలిసి మూడో కూటమిగా ఏర్పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇటీవల అన్నాడీఎంకే పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ రకమైన వార్తలు మరింత పెరిగాయి.కాంగ్రెస్ బీజేపీ( BJP Congress party ) తరువాత జాతీయ రాజకీయాల్లో ఎక్కువ ప్రభావం చూపే బిఎస్పీ పార్టీ ఆ రెండు కూటములకు దూరంగా ఉంది.ఇటు బిఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్ బీజేపీకి సమ దూరం పాటిస్తోంది.
కాగా కేసిఆర్ థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇక బిజూ జనతాదళ్ కూడా ఏ కూటమిలో లేదు.ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీకూడా స్వతంత్రంగా మారింది.దీంతో ఈ పార్టీలన్నీ కలిసి మూడో కూటమిగా ఏర్పడిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం.ఒకవేళ ఆ దిశగా అడుగులు పడితే ఎన్డీయే, ఇండియా కూటమిలలోని మరికొన్ని పార్టీలు బయటకు వచ్చి థర్డ్ ఫ్రంట్ కు జై కొట్టే అవకాశం లేకపోలేదు.
ఇక ప్రస్తుతం తటస్థంగా వ్యవహరిస్తున్న వైసీపీ, టిడిపి ( YCP tdp party )వంటి పార్టీలు కూడా థర్డ్ ఫ్రంట్ లో చేరిన ఆశ్చర్యం లేదనేది కొందరి మాట.మరి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వస్తారా ? లేదా ఎవరికి వారు స్వతంత్రంగా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతారా అనేది చూడాలి.