నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) నటించిన సినిమా అఖండ.గతంలో ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది.
థియేటర్లలో రికార్డుల మోత మోగించింది.ఇకపోతే ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నా బాలయ్య బాబు ఫేవరేట్ డైరెక్టర్ అయిన బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 ( Akhanda2 )సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.
వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అఖండ మూవీ భారీ విజయం సాధించింది.

ఇప్పుడు తాజాగా అఖండ సినిమాకు మేకర్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.దర్శకుడు బోయపాటి శ్రీను ( Director Boyapati Srinu )ఇప్పటికే కథ సిద్ధం చేసినట్లు సమాచారం.త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.
అఖండ 2 సినిమా కొత్త కథతో తెరకెక్కనుందని టాక్.అయితే అఖండ 2 లో కొత్త హీరోయిన్ ను తీసుకోనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే అఖండ 2 లో సీనియర్ హీరోయిన్ భూమిక( Heroine Bhumika ) ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే బాలయ్య బాబు విషయానికి వస్తే.

బాలకృష్ణ గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా NBK109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమా తర్వాత అఖండ 2 లో నటించనున్నారు బాలయ్య బాబు.