ఈటెలకే ఛాన్స్ ? బీజేపీ అధిష్ఠానం ఇలా డిసైడ్ అయ్యిందా ?

గత కొద్ది రోజులుగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay Kumar ) ను మార్చబోతున్నారని, ఆయన స్థానంలో కీలక నేతకు బాధ్యతలు అప్పగించబోతున్నారనే హడావుడి జరుగుతోంది.ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణపై పూర్తిగా ఫొటోస్ పెట్టిన బిజెపి అధిష్టానం, ఇక్కడ పార్టీలో పరిస్థితులపై పూర్తిగా దృష్టిసారించింది.

 A Chance For Etela Rajende Has The Bjp High Command ...decided Like This? Etela-TeluguStop.com

అంతర్గతంగా పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకునేందుకు నాయకులు ప్రాధాన్యం ఇవ్వడం, టిఆర్ఎస్, కాంగ్రెస్ లు రోజురోజుకు మరింత బలం పెంచుకోవడం, అదే సమయంలో తెలంగాణ బిజెపిలో చేరికలు అంతంత మాత్రంగానే ఉండడం వంటి వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టింది.మరికొన్ని నెలలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో, పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది.

దీనిలో భాగంగానే ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది.

Telugu Amit Shah, Brs, Central, Congress, Etela Rajendar, Etela Rajender, Telang

సామాజిక సమీకరణాలు, రాజకీయ అనుభవం ఆధారంగా ప్రస్తుతం చేరికలు కమిటీ చైర్మన్ గా ఉన్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి కీలక పదవిని కట్టబెట్టాలనే ఆలోచనలు ఉందట.

దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇప్పటికే బిజెపి పెద్దల పిలుపు మేరకు ఈటెల రాజేందర్( Etela Rajender ) ఢిల్లీకి వెళ్లారు.

నిన్ననే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah )తో దాదాపు గంట పాటు రాజేందర్ సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, చేరికలు, పార్టీ కార్యక్రమాలు, రాబోయే ఎన్నికల వ్యవహారచన, పార్టీ నేతలకు బాధ్యతలు వంటి అనేక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగిందట.

Telugu Amit Shah, Brs, Central, Congress, Etela Rajendar, Etela Rajender, Telang

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ చైర్మన్ వరకు మార్పు చేర్పులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా చెప్పారట.కొత్త నియామకలకు సంబంధించి వారం, పది రోజుల్లోనే కీలక ప్రకటన చేసేందుకు బిజెపి అధిష్టానం సిద్ధమవుతోందట.

పార్టీలో పెద్ద ఎత్తున చేరుకలను ప్రోత్సహించాలని సూచించారు.ముఖ్యంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Ponguleti Srinivasa Reddy )తో పాటు,బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న అసంతృప్తి నేతలను బిజెపిలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయాలనీ, తాను ఈ నెల చివరిలో కానీ, లేదా వచ్చే నెల మొదట్లో తెలంగాణ పర్యటనకు వస్తానని చెప్పారట.

ఈ సందర్భంగా ఎన్నికల వ్యవహారాలు, పార్టీ మేనిఫెస్టో, పార్టీ బలోపేతం రాష్ట్రస్థాయి నుంచి నియోజకవర్గంలో ముఖ్య నేతల బహిరంగ సభలు, ఇతర అంశాలపై క్లారిటీ ఇవ్వబోతున్నారట.బీఆర్ఎస్ లో విస్తృతంగా పరిచయాలు ఉండడం, మొదటి నుంచి కెసిఆర్ వ్యూహాలు గురించి తెలిసిన వ్యక్తి కావడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటున్న బిజెపి అధిష్టానం ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మంచిదనే ఆలోచనతో ఉందట.

ఈ మేరకు మరికొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ రాబోతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube