వైరల్ వీడియో: స్కూల్‌ కారిడార్‌లో గుండె నొప్పి.. అక్కడిక్కడే మృతి చెందిన బాలుడు..?

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ప్రజలు గుండెపోటుతో జబ్బులతో చనిపోతున్నారు.

రాజస్థాన్ రాష్ట్రం, దౌసా సిటీలో( Dausa City, Rajasthan State ) ఇలాంటి మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

ఇక్కడ 10వ తరగతి చదువుకుంటున్న ఓ స్టూడెంట్ గుండెపోటుతో మరణించాడు.అతడిని యతేంద్ర ఉపాధ్యాయ్‌గా గుర్తించారు.16 ఏళ్ల యతేంద్ర శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో స్కూల్‌లో తన తరగతి గది వైపు వెళ్తున్నప్పుడు కుప్పకూలిపోయాడు.స్కూల్ సిబ్బంది వెంటనే అతనికి సహాయం చేసి, ఆస్పత్రికి తరలించారు.

అయితే, అప్పటి చేయి దాటిపోయింది. యతేంద్ర( Yatendra ) తుది శ్వాస విడిచాడు.

యతేంద్రకు గుండె జబ్బు ఉందని, అతను కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటన యతేంద్ర కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Advertisement

స్కూల్ యాజమాన్యం యతేంద్ర మరణానికి సంతాపం వ్యక్తం చేసింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వారు అయ్యింది అందులో యతేంద్ర నడుస్తూ వెళ్తూ కింద పడిపోవడం చూడవచ్చు.

తర్వాత స్కూల్ సిబ్బంది హెల్ప్ చేయడం మనం గమనించవచ్చు.

ఆసుపత్రిలో డ్యూటీ చేస్తున్న డాక్టర్ పవన్ జార్వాల్ ( Dr.Pawan Jarwal )మాట్లాడుతూ, "స్కూల్ సిబ్బంది కుర్రాణ్ణి తీసుకొచ్చారు.అప్పటికే అతని గుండె కొట్టుకోవడం లేదు.

మేం CPR ప్రయత్నించాం కానీ, ఫలితం లేకుండా పోయింది" అని చెప్పారు.యతేంద్ర కుటుంబ సభ్యులు, మూడేళ్ల క్రితం అతనికి గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, రాజస్థాన్‌లోని జేకే ఆసుపత్రిలో 15 రోజులు చికిత్స పొందాడని తెలిపారు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!

అయితే, పోస్ట్‌మార్టం చేయించడానికి వారు నిరాకరించారు.

Advertisement

బండికుయ్ పోలీస్ స్టేషన్ SHO ప్రేమ్ చంద్( SHO Prem Chand ) మాట్లాడుతూ, డాక్టర్లు యతేంద్రకు గుండెపోటు వచ్చిందని అనుమానిస్తున్నారని, కానీ కుటుంబం పోస్ట్‌మార్టం చేయించడానికి అంగీకరించలేదని చెప్పారు.ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం యతేంద్రను బండికుయ్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లిందని, అక్కడ డాక్టర్లు అతన్ని మృతిగా ప్రకటించారని తెలిపారు.అతని అంత్యక్రియలు అల్వార్‌లోని స్వగ్రామంలో నిర్వహిస్తామని పోలీసులకు పేరెంట్స్ తెలిపారు.

తాజా వార్తలు