వనపర్తి జిల్లాలో మొసలి( crocodile ) కలకలం సృష్టించింది.వనపర్తి జిల్లాలోని అమరచింత పెద్ద చెరువులో నుంచి ఓ భారీ మొసలి బయటకు వచ్చి కలకలం రేపింది.
చెరువు నుంచి బయట రోడ్డుపైకి మొసలి వచ్చింది.చెరువులోనుంచి ఆహారం వెతుక్కుంటూ రోడ్డుపైకి వచ్చింది.
అనంరతం జనావాసాల్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేసింది.ఈక్రమంలో ఆ పెద్ద మొసలి రోడ్డు దాటుతుండగా కొందరు స్థానిక యువకులు చూసి భయాందోళనకు గురయ్యారు.
భారీ మొసలిని తాళ్లతో బంధించారు.అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
అటవీశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.మొసలిని బంధించి తీసుకెళ్లారు.జనవాసాలు లేని ప్రాంతాల్లో మొసలిని అటవీశాఖ అధికారులు వదిలిపెట్టనున్నారు.ఒక వాహనదారుడు రోడ్డుమీద వెళుతుండగా.
భారీ మొసలి కనిపించింది.దీంతో వాహనదారుడు సడెన్ బ్రేక్ వేశాడు.
దీంతో వెనకే అన్ని వాహనాలు ఆగిపోయాయి.ఇంతలోనే కొంతమంది యువకులు పెద్ద పెద్ద తాళ్లు పట్టుకొని పరుగులు తీశారు.
ఏమై ఉంటుందా అని వాహనదారుల్లో కాస్త కలకలం రేగింది.అయితే వారు ఊహించినంత ప్రమాదమేమీ జరగలేదు.
నడిరోడ్డుమీద భారీ మొసలి ప్రత్యక్షం కావడం చూసి షాక్ కు గురయ్యారు.తాళ్లతో బంధించిన మొసలి జనావాసాల్లోకి వెళ్లలేదు.
లేకపోతే జనావాసాల్లోకి వెళ్లేదని స్థానికులు చెబుతున్నారు.

మంగళవారం అర్ధరాత్రి ఈ భారీ మొసలి ప్రత్యక్షమైంది.ఇది పది అడుగుల పొడవు.మూడు క్వింటాళ్ల బరువు ఉంది.
ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ఈ మొసలిని వదిలిపెట్టారని ఎస్సై జగన్ తెలిపారు.పామిరెడ్డిపల్లికి( Pamireddypalli ) చెందిన వాల్మీకి రాజు, వెంకటేశ్ బైక్‌పై వెళ్తుండగా.
మొసలిని చూశారని పోలీసులు తెలిపారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
డీఎఫ్‌వో ఆదేశాల మేరకు స్నేక్ సొసైటీ సభ్యులు కృష్ణసాగర్, గోపాల్, నరేందర్ అక్కడకు చేరుకొని మొసలిని తాళ్లతో బంధించారు.