నిజామాబాద్ అమానుష ఘటన వెలుగుచూసింది.ఒంటరి మహిళతో సహజీవనం చేస్తూ ఆమె ఆరేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడి ప్రాణాలు తీసాడో కామాంధుడు.
ఈ విషయం భయటపడకుండా బాలికది సహజమరణంగా చిత్రీకరించే శతథా ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.కామారెడ్డి జిల్లాకు చెందిన ఒంటరి మహిళ ఆరేళ్ల కూతురితో కలిసి జీవిస్తోంది.
ఆ మహిళపై గోవింద్ రావు అనే దుర్మార్గుడి కన్నుపడింది.మాయమాటలతో మహిళను లోబర్చుకున్నాడు.
ఆరేళ్ల చిన్నారిని వదిలిపెట్టలేదు.అభం శుభం తెలియని బాలికను ఈ నెల 20 తేదీన అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు.