జపాన్ మార్కెట్ లో కూడా ఆర్ఆర్ఆర్ సంచలనం.. టీమ్ వెరీ ఎగ్జైట్!

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్.అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

 Ss Rajamouli's Rrr Breaks Into Top 10 Chart In Japan, Ram Charan, Rrr, Rajamouli-TeluguStop.com

అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించి.నటన పరంగా అదరగొట్టారు.

అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.

నాలుగేళ్ళ నిరీక్షణకు ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.జక్కన్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్ సినిమా దగ్గర మన తెలుగు ఖ్యాతిని పెంచేసాడు.

ఇక ఇటీవలే ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేసారు.అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

Telugu Japan, Rajamouli, Ram Charan, Rrr, Rrr Japan-Movie

ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం స్వయంగా దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తమ సతీమణులతో కలిసి జపాన్ చుట్టేసి వచ్చారు.దీంతో ఈ సినిమా అక్కడ కూడా భారీ హైప్ తో దూసుకు పోతుంది.ఈ సినిమాకు జపాన్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజు 1.06 కోట్లు రాబట్టి జపాన్ లో అతిపెద్ద ఓపెనింగ్ రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది.

అలాగే ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ ఫస్ట్ వీక్ సాధించిన చిత్రంగా కూడా నిలిచింది.

జపాన్ బాక్సాఫీస్ ఓపెనింగ్ సినిమాల్లో టాప్ 9 జాపనీస్ సినిమాలు ఉండగా టాప్ 10వ స్థానంలో ట్రిపుల్ ఆర్ సినిమా ఉంది.ఇంత ఆదరణ దక్కుతుండడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా రెండవ వారానికి చేరుకున్నప్పటికీ ఇప్పటికి అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ తో సత్తా చాటుతుంది.దీంతో అక్కడి ప్రేక్షకులకు ట్రిపుల్ ఆర్ టీమ్ ధన్యవాదములు చెబుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube