జపాన్ మార్కెట్ లో కూడా ఆర్ఆర్ఆర్ సంచలనం.. టీమ్ వెరీ ఎగ్జైట్!

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్.అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించి.నటన పరంగా అదరగొట్టారు.

అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.

నాలుగేళ్ళ నిరీక్షణకు ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

జక్కన్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్ సినిమా దగ్గర మన తెలుగు ఖ్యాతిని పెంచేసాడు.

ఇక ఇటీవలే ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేసారు.అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

"""/"/ ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం స్వయంగా దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తమ సతీమణులతో కలిసి జపాన్ చుట్టేసి వచ్చారు.

దీంతో ఈ సినిమా అక్కడ కూడా భారీ హైప్ తో దూసుకు పోతుంది.

ఈ సినిమాకు జపాన్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.తొలిరోజు 1.

06 కోట్లు రాబట్టి జపాన్ లో అతిపెద్ద ఓపెనింగ్ రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది.

అలాగే ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ ఫస్ట్ వీక్ సాధించిన చిత్రంగా కూడా నిలిచింది.

జపాన్ బాక్సాఫీస్ ఓపెనింగ్ సినిమాల్లో టాప్ 9 జాపనీస్ సినిమాలు ఉండగా టాప్ 10వ స్థానంలో ట్రిపుల్ ఆర్ సినిమా ఉంది.

ఇంత ఆదరణ దక్కుతుండడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సినిమా రెండవ వారానికి చేరుకున్నప్పటికీ ఇప్పటికి అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ తో సత్తా చాటుతుంది.

దీంతో అక్కడి ప్రేక్షకులకు ట్రిపుల్ ఆర్ టీమ్ ధన్యవాదములు చెబుతుంది.