ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ మంచి రేటింగ్స్ తోనే దూసుకు పోతుంది.ఎందుకంటే గత రెండు వారాలుగా బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో మరో వికెట్ పడింది.మొదట్లో మొత్తం 21 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ ఏనిమిదో వారానికి చేరేటప్పటికి హౌస్‌లో 14 మంది సభ్యులు మాత్రమే మిగిలారు.
అయితే గత వారం అర్జున్ ఎలిమినేట్ అవ్వగా అంతకు ముందు వరుసగా షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి, చలాకీ చంటి, సుదీపలు ఎలిమినేట్ అయ్యారు.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ప్రజలలో ఆసక్తి నెలకొల్పేలా జరుగుతూ ఉంది.
అయితే ఏనిమిదో వారం ఓటింగ్ లో శ్రీహాన్, రేవంత్ మొదటి స్థానం లో ఉన్నారు.వీరిద్దరికీ 30 శాతం ఓటింగ్ ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే చివరి స్థానం లో రాజశేఖర్, ఆర్ జే సూర్య ఉన్నట్టు సమాచారం.దీంతో ఈ వారం ఆర్ జే సూర్య ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.అందులో నాగార్జున కంటెస్టెంట్స్ పై భారీగా ఫైర్ అయ్యాడు.

ముఖ్యంగా గీతు ఎప్పుడు ఏదో ఒక గొడవలు చేస్తూ వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది.హౌస్ లో అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది.ప్రస్తుత సమయంలో నాగార్జున గీతు పై విపరీతమైన కోపం తో రగిలిపోయాడు.సంచాలక్ గా కరెక్ట్ గా చెయ్యలేదని సంచాలక్ గా కాకుండా గేమ్ ఆదిందని గీతు పై ఫైర్ అయ్యాడు.
నీ ఆట ఓ బోచ్చులో ఆట అని ఆమెపై విరుచుకుపడ్డాడు నాగ్.ఇక నువ్వు చేసిన దానికి శిక్ష పడాల్సిందే.నువ్వు శిక్షకు అర్హురాలివి అని అన్నాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







