హీరో లెక్ట్రో కంపెనీ హెచ్3, హెచ్5 పేరుతో రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను విడుదల చేసింది.ఒకటి రూ.27,499.ఇంకొకటి రూ.28,499 ధరలకు విడుదల చేసింది.హెచ్3 ఈ-సైకిల్ బ్లిస్‌ఫుల్ బ్లాక్-గ్రీన్, బ్లేజింగ్ బ్లాక్-రెడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది.అయితే హెచ్5 సైకిల్ గ్రూవీ గ్రీన్, గ్లోరియస్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో రిలీజ్ అయింది.సులభమైన యాక్సెస్ ఛార్జింగ్ పోర్ట్‌లు, హై-పెర్ఫార్మెన్స్ ఎఫెక్టివ్ కార్బన్ స్టీల్ ఫ్రేమ్, ఐపీ67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ ఇన్-ట్యూబ్ Li-ion బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కంపెనీ ఈ రెండు సైకిళ్లలో అందించింది.
భారతదేశంలోని అన్ని వాతావరణ పరిస్థితులలో కూడా ఇవి ప్రయాణించగలవు.అంతేకాకుండా, ఈ సైకిల్స్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను ఆఫర్ చేశారు.
సిటీ, ఆఫ్-ట్రాక్ రోడ్లలో ఇవి ప్రయాణించగలవు.ఈ సైకిల్స్‌లో స్మార్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లే, IP67 Li-ion 5.8Ah ఇంట్యూబ్ బ్యాటరీ, 250W BLDC రియర్ హబ్ మోటార్ ఆఫర్ చేశారు.ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 30 కి.మీ వరకు రేంజ్ ఆఫర్ చేస్తుంది.మోటారు నుంచి గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీ.వీటి బ్యాటరీలను ఫుల్ గా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

కంపెనీ వెబ్‌సైట్‌లో, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి సైకిల్స్ అందుబాటులో ఉన్నాయి.అలాగే ఎక్స్‌టర్నల్ డీలర్‌షిప్ నెట్‌వర్క్స్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలోని స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలు, జోన్‌లలో ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.సిటీలో 10 కిలోమీటర్ల పరిధిలో తిరిగేవారికి ఈ సైకిల్స్ బాగా ఉపయోగపడతాయి.మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయవచ్చు.







