మెగా అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోతున్నారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలి హీరోగా చెలామణి అవడానికి ఇష్టం పడటం లేదన్న వార్తలను నిజం చేస్తూ, ఒకదాని వెనుక మరో ఘటనలు జరుగుతున్నాయి.
బన్ని తన ఇంటర్వ్యూలలో ఒకప్పటిలా మెగాహీరోల భజన చేయట్లేదు.మొన్నటికి మొన్న సరైనోడు సక్సెస్ మీట్ లో జనాలంతా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ గోలచేస్తే “చెప్పను బ్రదర్” అంటూ బన్ని మొహమాటం లేకుండా అనేయటం, చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆభిమానులకు మింగుడుపడలేదు.
ఇక తాజాగా విజయనగరంలో సపరేట్ గా అల్లు అర్జున్ బ్యానర్స్ కనబడుతున్నాయి.ఇదివరకు అల్లు అర్జున్ కి మెగాహీరోలతో కలిపి బ్యానర్లు కట్టేవారు.
ఈ మధ్య అభిమానుల మధ్య జరుగుతున్న గొడవల ప్రభావమో ఏమో, సపరేట్ బ్యానర్లు కట్టడం మాత్రమే కాదు, మెగా ఫ్యామిలికి ఇండైరెక్ట్ వార్నింగులు కూడా ఇస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.ఈ గొడవలు ఎక్కడిదాకా వెళతాయో.







