పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒకరిని మరొకరు పోటీ పడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.వారి హంగామాకు కారణం… పవన్ కళ్యాణ్ నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ “ఖుషి” సినిమా విడుదలై 15 ఏళ్ళు పూర్తి కాగా, జూనియర్ ఎన్టీఆర్ – బోయపాటి కాంభినేషన్లో విడుదలైన “దమ్ము” చిత్రానికి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి.
రెండక్షరాలతో ఉన్న ఈ రెండు సినిమాలు ఏప్రిల్ 27వ తేదీనే విడుదలయ్యాయి.అయితే పవన్ ఫ్యాన్స్ కు మరో స్పెషల్ ట్రీట్ ఏమిటంటే… ‘ఖుషి’ విడుదలైన రోజునే పవన్ – సూర్య కాంభినేషన్ లో మరో సినిమా ప్రారంభమైంది.
‘ఖుషి’ సీక్వెల్ గా పిలవబడుతున్న ఈ సినిమాకు ‘హుషారు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని, సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ నిన్నా ఇవాళా సందడి చేస్తున్నారు.
పవర్ స్టార్ అభిమానులకు తోడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా జతకట్టారు.‘బుడ్డోడు’ నటించిన పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ “దమ్ము” సినిమా ఆశించిన మేరకు ప్రజాధరణ పొందనప్పటికీ, బోయపాటి మార్క్ తో మాస్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
దీంతో ‘బుడ్డోడు’ ఫ్యాన్స్ కూడా ‘దమ్ము’ సినిమాపై ట్వీట్లు చేస్తూ పండగ చేసుకుంటున్నారు.







