సరైనోడుకి అగ్ని పరీక్ష నేడు

అల్లు అర్జున్ సరైనోడు మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్లు రాబట్టింది.పెద్ద సినిమాలేవి పోటిలో లేకపోవడం, వేసవి సెలవులు కావడం, సరైనోడుకి బాగా కలిసివచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉన్నా, ఓవర్సీస్ లో నడుస్తున్న స్లో ట్రెండ్ అక్కడి పంపిణిదారులను కలవర పెడుతోంది.ఇక భారతదేశంలో అసలైన పరీక్ష నేటితో మొదలయ్యింది.

కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్ చాలా డల్ గా ఉంది.నైజాం మల్టిప్లెక్సుల్లో ఉదయం ఆటలు కూడా ఆశించిన స్థాయిలో లేవు.

ఎటు చేసి సినిమాకి ప్రధాన బలంగా బ,సి, సెంటర్లే కనిపిస్తిన్నాయి.వైజాగ్ లో ఈరోజు ఉదయం ఆటలు చాలా డల్ గా ఉంటే, హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో మంచి ఆక్యుపెన్సి ఉంది, అలాగే కర్నూలు లో కూడా బాగా ఉంది సినిమా స్టేటస్.

Advertisement

ఈరకంగా మిశ్రమ ఫలితాలతో ఈరోజు మొదలైంది.ఈరోజంతా ఎలా సాగుతుంది అనేదాని మీదే సరైనోడు అంతిమ ఫలితం మీద ఒక అంచనాకు రావొచ్చు.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు