మాస్ .ఊర మాస్ అంటూ తెలుగు రాష్ట్రాల్లోని మాస్ ప్రేక్షకులని తనవైపు తిప్పుకునేందుకు పెద్ద పథకమే వేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
బి,సి సెంటర్లలో కలెక్షన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి.ఇదే ఊపు రెండువారాలు కొనసాగితే మంచి కలెక్షన్లు రాబట్టుకుటుంది ఈ చిత్రం.
కాని రెండోవరోజే మరో ఏరియాలో పంపిణీదారులకి చుక్కలు చూపిస్తోంది సరైనోడు.
మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది, మేము మాట్లాడుతున్నది ఓవర్సీస్ గురించి అని.బన్ని గత రెండు చిత్రాలు ఓవర్సీస్ లో బాగా ఆడటంతో, ఖర్చుకి వెనకాడకుండా 6.20కోట్లు పెట్టేసారు ఓవర్సీస్ బయ్యర్లు.ఇక మన తెలుగు సినిమాకి 90%-95% ఓవర్సీస్ మార్కేట్ అమెరికాలోనే ఉంది.
ప్రీమియర్స్ లో $190k సంపాదించిన సరైనోడు, తొలిరోజు $193k రాబట్టింది అమెరికాలో.అంటే మొత్తం $383k.బన్ని గతచిత్రం సన్నాఫ్ సత్యమూర్తి కేవలం ప్రీమియర్స్ ద్వారానే $345k రాబట్టింది.
అప్పుడు త్రివిక్రమ్, ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకుడు అవడమే ఈ తేడాకు కారణం.
సరైనోడుకి అమెరికాలో వస్తున్న రెస్పాస్స్ కి డిస్ట్రీబ్యుటర్ల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.
ఇంకో రకంగా చెప్పాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.







