జంగల్ బుక్ భారదేశంలో అదరగొడుతోంది.రెండోవారంలోకి అడుగుపెట్టినా, మహానగరాల్లో ఇంకా ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టలేదు.
ఎదో హాలివుడ్ డబ్బింగ్ సినిమా అని తీసిపారేయ్యడానికి వీలు లేకుండా, మొదట సర్దార్ గబ్బర్ సింగ్ మల్టిప్లెక్స్ షోలతో పాటు సర్దార్ హిందీ వెర్షన్ ని దారుణంగా దెబ్బతీసిన జంగల్ బుక్, ఇప్పుడు షారుఖ్ ఖాన్ ని కూడా దెబ్బతీసింది.ఇద్దరు స్టార్ హీరోలకి చుక్కలు చూపించాడు జంగల్ బుక్ బుడ్డోడు నీల్ సేథి.
హైదరాబాద్ లో సర్దార్ గబ్బర్ సింగ్ థియేటర్లకి బదులు, జంగల్ బుక్ థియేటర్లలో కూర్చొని పవన్ కళ్యాన్ కి ద్రోహం చేస్తున్నారని రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేసారంటే మీరే అర్థం చేసుకోండి, భాగ్యనగరంలో జంగల్ బుక్ ఆడుతున్న హాళ్ళు జనంతో ఎలా కలకలలాడుతున్నాయో.ఈ చిత్రం కారణంగానే హైదరాబాద్ మల్టిప్లేక్సుల్లో ఊహించిన విడుదల దొరకలేదు సర్దార్ కి.ఆ తరువాత కొన్ని ఏ సెంటర్ల నుంచి సర్దార్ ని తీసెయ్యడానికి కూడా జంగల్ బుక్ చిత్రమే కారణం.
ఇక నిన్న షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ విడుదల అయ్యింది.మొదటిరోజు కేవలం 18.25 కోట్లు మాత్రమే కొల్లగొట్టింది ఫ్యాన్.ఎదురుగా ఫ్యాన్ లాంటి పెద్ద సినిమాని పెట్టుకొని, మనదేశంలో నిన్న 8 కోట్లకు పైగా వసూలు చేసింది జంగల్ బుక్.ఇంతే కాదండోయ్ .మొదటివారం 80 కోట్లు సంపాదించిన జంగల్ బుక్, రేపు 100 కోట్లు దాటేయడం ఖాయం.
ఈ రకంగా, అటు బాలివుడ్ స్టార్ హీరోతో, ఇటు టాలివుడ్ స్టార్ హీరో తో ఆడుకున్నాడు ఆ చిన్నపిల్లాడు.







