పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రానికి కథ మరియు స్క్రీన్‌ప్లేను అందించిన విషయం తెల్సిందే.‘జానీ’ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కథ మరియు స్క్రీన్‌ప్లేను అందించాడు.
అయితే ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతుంది.ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లే చెత్తగా ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ మళ్లీ కథలు రాస్తాడా అనే టాక్ వినిపిస్తోంది.
‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం విడుదలకు ముందు తాను నటుడిగా మూడు నాలుగు సినిమాలు మాత్రమే చేస్తాను అని, ఆ తర్వాత హీరోగా సినిమాలు చేయడం మానేస్తాను అంటూ పవన్ ప్రకటించాడు.
సినిమాల్లో నటించడం మానేసినా కూడా తాను కథలు మరియు స్క్రీన్‌ప్లేలు రాస్తూ ఉంటాను అని అన్నాడు.ఇప్పటి వరకు రాసిన రెండు కథలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి.
భవిష్యత్తులో ఈయన రాసిన కథలు మాత్రం ఎలా బాగుంటాయి అంటూ యాంటీ మెగా ఫ్యాన్స్ అంటున్నారు.పవన్ మళ్లీ కథలు అంటూ పెన్ను పట్టుకోక పోవడం మంచిది అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఫ్యాన్స్ కూడా తన కథలతో కాకుండా వేరే రచయితల కథలతో పవన్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.మరి పవన్ భవిష్యత్తులో ఏం చేస్తాడు అనేది చూడాలి.







