ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాల్లో ఒక్కటి ‘కందిరీగ’.ఆ సినిమా రామ్ కెరీర్‌కు మంచి బూస్ట్‌ను ఇచ్చింది.
‘కందిరీగ’ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.ఆ సినిమాతో సంతోష్ శ్రీనివాస్‌కు కూడా ఒక్కసారిగా క్రేజ్ భారీగా పెరిగిపోయింది.
ఆ సినిమాతో ఎన్టీఆర్ ‘రభస’ చిత్రంకు దర్శకత్వం వహించే అవకాశాన్ని సంతోష్ శ్రీనివాస్ దక్కించుకున్నాడు.అయితే సంతోష్ శ్రీనివాస్ ‘రభస’ను వాడుకోవడంలో విఫలం అయ్యాడు.
‘రభస’ ఫ్లాప్ అవ్వడంతో సంతోష్‌తో సినిమా చేసేందుకు ఏ హీరో కూడా దగ్గరకు రాలేదు.దాంతో ‘రభస’ విడుదలైన ఇన్నాళ్ల వరకు సంతోష్ తన మూడవ సినిమాను విడుదల చేయలేక పోయాడు.
‘కందిరీగ’ వంటి కమర్షియల్ సక్సెస్‌ను అందించిన సంతోష్ శ్రీనివాస్‌ను మరోసారి నమ్మాలని రామ్ నిర్ణయించుకున్నాడు.తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో రెండవ సినిమా షురూ అయ్యింది.
ఉగాది సందర్బంగా రామ్, సంతోష్ శ్రీనివాస్‌ల కొత్త సినిమా షురూ అయ్యింది.మరోసారి రామ్ ఎనర్జికి తగ్గట్లుగా మంచి కథను సిద్దం చేసినట్లుగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చెబుతున్నాడు.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించడం కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి ఇదే సంవత్సరంలో విడుదల చేయాలని 14 రీల్స్ సంస్థ భావిస్తోంది.
మరి రామ్ మరియు సంతోష్ శ్రీనివాస్‌లు ‘కందిరీగ’ను మరోసారి చూపిస్తారా లేక రభసలాంటి ఫలితాన్నే సంతోష్ చవి చూస్తాడా అనేది చూడాలి.







