మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’ అట్టర్ ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే.తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’కు రీమేక్‌గా చరణ్ సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలోనే ఆగస్టు 5న చిత్రాన్ని విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు.అయితే తాజాగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ సినిమా ఆగస్టులో లేదని తేలిపోయింది.
దసరాకు చరణ్ సినిమా వచ్చే అవకాశాలున్నాయి
చరణ్ సినిమా ప్రారంభించిన వెంటనే శ్రీజ పెళ్లి హడావుడి మొదలైంది.ఆ పెళ్లి వేడుకతో చరణ్ బిజీ బిజీగా ఉన్నాడు.
దాదాపు నెల రోజులుగా షూటింగ్‌కు దూరంగా ఉన్నాడు.ఆ తర్వాత చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన వర్క్‌లో కూడా చిరు పాల్గొనాల్సి ఉంది.
ఇలా వరుసగా ఇతర పనులు ఉండటం వల్ల చరణ్ ఈ చిత్రంను అనుకున్న సమయంలో పూర్తి చేయలేక పోతున్నాడు అంటూ సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.అందుకు చరణ్ సినిమా ఆగస్టులో కాకుండా అక్టోబర్‌లో విడుదల అవ్వనుంది అంటున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.ఈ చిత్రానికి ‘దృవ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.







