మెగా మూవీ ఏది అయినా, దర్శకుడు ఎవరు అయినా కూడా భారీ అంచనాలు రావడం చాలా సహజం.మెగా హీరోల చిత్రాలతో పాటు మెగా హీరోయిన్ నిహారిక చిత్రానికి కూడా రికార్డు స్థాయి బిజినెస్ జరుగుతోంది.నిహారిక హీరోయిన్‌గా ‘ఒక మనసు’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.టీవీ9 మరియు మధుర శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ లాభాలను తెచ్చి పెట్టినట్లుగా సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ‘ఒక మనసు’ చిత్రం కోటిన్నర బడ్జెట్‌తో నిర్మితం అయ్యిందని తెలుస్తోంది.ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు బిజినెస్ ప్రారంభించారు.
ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా ఏకంగా అయిదు కోట్ల బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.సినిమా విడుదలకు ముందే ఈ స్థాయిలో లాభాలు వచ్చాయి.ఇక సినిమా విడుదలై ఏమాత్రం సక్సెస్ అయినా కూడా మరిన్ని లాభాలు నిర్మాతలకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.టీవీ9 తెరంగేట్రం చేసిన మొదటి చిత్రంతోనే భారీ లాభాలను దక్కించుకుంటోంది.







