మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మేముసైతం’ కార్యక్రమంకు పలువురు సెలబ్రెటీలు తమ వంతు సాయం అందిస్తున్నారు.ఆ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయలు అమ్మగా, అఖిల్ ఆటో నడిపాడు, లావణ్య త్రిపాటి చెరుకు రసం అమ్మింది.
మోహన్‌బాబుతో పాటు ఇంకా పలువురు సెలబ్రెటీలు కూడా తమ వంతు సాయంగా ముందుకు వచ్చి నిధులు సేకరించారు.పేదవారికి, ఆపదలో ఉన్న వారికి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి మేము సైతం కార్యక్రమం ద్వారా ఆపన్న హస్తం అందించాలనే ఉద్దేశ్యంతో మంచు లక్ష్మి ఈ షోను నిర్వహిస్తోంది.
తాజాగా ఈ షోకు సీఎం చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణీ హాజరు అయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మణీ ఒక కుటుంబంకు తమ కంపెనీ తరపున సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి.
నారా వారి కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎప్పుడు బిజీగా ఉండే బ్రహ్మణీ ఇలా బుల్లి తెరపై కనిపించడంతో అంతా ఒక్కసారిగా ఆసక్తిని కనబర్చుతున్నారు.త్వరలోనే ఈ కార్యక్రమం జెమినిటీవీలో టెలికాస్ట్ అవ్వబోతుంది.
మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మరింత మంది సెలబ్రెటీలు పాల్గొనే అవకాశాలున్నాయి.







