మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే.ఈ వేడుకకు మెగా బ్రదర్ నాగబాబు దూరంగా ఉన్నాడు అనే వార్తలు వచ్చినప్పటికి, పెళ్లి సమయంకు పెళ్లిలో నాగబాబు కుటుంబం సందడి చేసింది.
ఇక మరో మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ ఈ పెళ్లికి దూరం అయ్యాడు.యూరప్‌లో సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం షూటింగ్ కారణంగా శ్రీజ పెళ్లికి పవన్ హాజరు కాలేక పోయాడు.
పవన్ కూడా ఈ వివాహానికి హాజరు అయ్యి ఉంటే బాగుండేది అంటూ కొందరు మెగా అభిమానులు అంటున్నారు.మెగా సన్నిహితులు సైతం పవన్ హాజరు అవ్వాల్సింది అన్నారు.
ఇక స్వయంగా చిరంజీవి సైతం తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఈ పెళ్లికి వస్తే మరింత శోభగా ఉండేది అంటూ సన్నిహితులతో అన్నాడట.దాంతో అంతటా కూడా పవన్ లేని లోటు క్లీయర్‌గా తెలుస్తోంది.
గతంలో శ్రీజ ప్రేమ వివాహం సమయంలో పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.ఆ విమర్శలను మనస్సులో ఉంచుకుని ఇప్పుడు పవన్ పెళ్లికి రాలేదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే శ్రీజ వివాహ రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.ఆ రిసెప్షన్‌కు పవన్ హాజరు అయ్యే అవకాశాలున్నాయి.