సర్దార్ గబ్బర్ సింగ్ పై కేసు

దబాంగ్ అనే సినిమా అటు సల్మాన్ ఖాన్ కెరీర్ ని, ఇటు పవన్ కళ్యాణ్ కెరీర్ ని మార్చేసింది.దబాంగ్ రాకముందు సల్మాన్ ని, గబ్బర్ సింగ్ రాకముందు పవన్ ని నెం.

1 రేసులోంచి తీసేసింది మీడియా.కాని తిక్క పోలిసోడి తిక్కవేశాలు జనాల్ని ఎంతలా ఆకట్టుకున్నాయంటే .ఈ ఇద్దరి ఇమేజ్ ఒక్కసారిగా పది మెట్లు ఎక్కేసింది.దబాంగ్ హక్కులని తీసుకోని గబ్బర్ సింగ్ తీసి బ్లాక్బస్టర్ కొట్టారు సరే .మరి సర్దార్ గబ్బర్ సింగ్ పరిస్థితి ఏంటి ? ఇందులో కూడా దబాంగ్ లోని చుల్ బుల్ పాండేని పోలిన క్యారెక్టరే కదా ఉండేది.మరి దీనికి కూడా హక్కులు తీసుకోవాలా? పవన్ కళ్యాణ్ - దబాంగ్ నిర్మాత, సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో మనకు తెలియదు కాని .ఇప్పుడు ఈ హక్కుల విషయం రసవత్తరంగా మారనుంది.ఎందుకంటే దబాంగ్ నిర్మాతలు అర్బాజ్ ఖాన్, ధిల్లీన్ మెహ్త సర్దార్ గబ్బర్ సింగ్ మేకర్స్ మీద కాపిరైట్స్ ఉల్లంఘన నేరం కింద కేసు వేసేసారని వార్త.

ఈ కేసు సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకి అడ్డంకిగా మారుతుందా లేక పవన్ కళ్యాణ్ పరిష్కరించుకుంటాడా అనేది చూడాలి.ఇప్పటివరకైతే, ఏప్రిల్ 8న ఉగాది కానుకగా ఈ గబ్బర్ సింగ్ సీక్వెల్ విడుదల కానుంది.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు