పవన్‌ కళ్యాణ్ కి 30 కోట్లు

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్స్‌ పారితోషికం చుక్కలను అంటున్నతున్న విషయం తెల్సిందే.స్టార్‌ హీరోలు పారితోషికాలతో పాటు, షేర్స్‌ను కూడా తీసుకుంటున్నారు.

అయితే తాజాగా పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రంకు గాను పారితోషికం తీసుకోకుండా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.నిర్మాణ వ్యయంతో సంబంధం లేకుండా, వచ్చిన మొత్తంలో షేర్‌ తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

భారీ అంచనాలున్న ‘సర్దార్‌’ చిత్రం భారీగానే బిజినెస్‌ చేసిందట.దాంతో ఈ చిత్రం ద్వారా పవన్‌ కళ్యాణ్‌కు దాదాపు 30 కోట్లు గిట్టుబాటు అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి.

చిత్రం విడుదల తర్వాత సక్సెస్‌ అయ్యి, భారీ వసూళ్లు సాధిస్తే ఆ మొత్తం మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు.బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శరత్‌ మారర్‌, యూరోస్‌ ఇండియా, పవన్‌ కళ్యాణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌ చెప్పకనే చెబుతోంది.ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించింది.

మరో ముఖ్య పాత్రలో ముద్దుగుమ్మ సంజన నటించగా, రాయ్‌ లక్ష్మి ఐటెం సాంగ్‌తో దుమ్ము రేపబోతుంది.

Advertisement

తాజా వార్తలు