పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ద్వారా ప్రేక్షకులను ఎంత మేరకు సంతృప్తి పర్చాలో అంతా కూడా సంతృప్తి పర్చేందుకు సిద్దం అవుతున్నాడు.తన స్టామినాకు మించి ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను పవన్ కళ్యాణ్ అందించనున్నట్లుగా తెలుస్తోంది.
ఇక పవన్ గొంతు విప్పితే సంచలనమే.‘అత్తారింటికి దారేది’ చిత్రంలో కాటం రాయుడ.
పాట పాడి సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్ మరోసారి తన పాటతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, సర్దార్ గబ్బర్‌సింగ్‌కు ప్లస్ పాయింట్‌ను యాడ్ చేయబోతున్నాడు.‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పాడిన కాటం రాయుడ పాటకు మంచి స్పందన రావడంతో మరోసారి పవన్ కళ్యాణ్‌తో ఒక చిన్న బిట్ సాంగ్‌ను పాడిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి దేవిశ్రీ ప్రసాద్ వచ్చాడు.
అనుకున్నదే తడువుగా ఆ విషయాన్ని పవన్ ముందు ఉంచాడు.పవన్ సైతం అభిమానులను సంతోష పెట్టేందుకు పాట పాడాలని నిర్ణయించుకున్నాడు.పోతురాజు అనే పాటను పవన్ పాడబోతున్నాడు.అయితే ఆ పాటను చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి అయిన తర్వాత విడుదలకు ముందు రికార్డు చేయనున్నారు.
ఆ పాట ఆడియో సీడీలలో ఉండే అవకాశం లేదు.సినిమాలోనే నేరుగా ఆ పాటను ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది.
గతంలో మాదిరిగా ఆ పాట రికార్డింగ్ మేకింగ్‌ను కూడా యూట్యూబ్‌లో విడుదల చేసే అవకాశాలున్నాయి.







