సెట్ లో సరైన ప్రవర్తన లేని కారణంగా పవన్ కళ్యాణ్ ప్రముఖ కామెడియన్ శకలక శంకర్ మీద చేయి చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.గత రెండు మూడు రోజులుగా ఇదో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే పవన్ కళ్యాణ్ తనని కొట్టలేదని క్లారిటి ఇచ్చాడు శంకర్.
తాను పవన్ కళ్యాణ్ ని దేవుడిలా భావిస్తానని, ఆయనే స్వయంగా పిలిచి సర్దార్ గబ్బర్ సింగ్ లో వేశం ఇప్పించారని, తనతో సెట్ లో జానపదగీతాలు పాడించుకుంటారని .ఎదో ఎప్పుడైనా సీన్ సరిగా చేయకపోతే చిన్నగా మందలిస్తుంటారని .అంతే తప్ప పవన్ నన్ను ఎప్పుడు కొట్టలేదని చెప్పుకొచ్చాడు శంకర్.
బేసిగ్ గా పవర్ స్టార్ కి శంకర్ వీరాభిమాని.మరి సెట్లో తనకి తన అభిమాన నటుడికి ఏం జరిగిందో చూసినవాళ్ళకే తెలుసు కాని, శంకర్ ని పవన్ కొట్టారని ఫిలింనగర్ ఢంకా బజాయించి చెబుతున్నారు .మరి శంకరేమో జస్ట్ మందలిమచారని చెబుతున్నాడు.ఏది నిజమో .ఏది అబద్ధమో!
.






