కన్న తల్లి కూతుళ్ళని చంపేసింది

సికింద్రాబాద్ లోని మారేడ్ పల్లి టీచర్స్ కాలనీ దారుణం జరిగింది.కన్నతల్లే తన ఇద్దరి కూతుళ్ల గొంతు కోసం వారిని హతమార్చింది.

 She Killed Her Daughters-TeluguStop.com

నిన్నరాత్రి తల్లి రజని తన కూతుళ్లు అశ్విక(7), తనిష్క(3)ల గొంతు కోయడంతో వారి ప్రాణాలు విడిచారు.వారిని హతమార్చిన అనంతరం ట్యాంక్ బండ్ కు రజని చేరుకుంది.

ఆత్మహత్యాయత్నానికి సిద్ధమవుతున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే, పిల్లలను హతమార్చడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రజనీ, విజయ్ దంపతులు.టీచర్స్ కాలనీలో నివసిస్తున్నారు.

వారితో పాటు వినయ్ తల్లి, సోదరి కూడా ఉంటున్నారు.

అయితే, కొన్నాళ్లుగా వారి మధ్య కుటుంబసలహాలు ఉన్నట్లు తెలుస్తోందని, ఈ క్రమంలోనే దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం వినయ్, రజనీ దంపతులు తుకారారం గేట్ పోలీసుల అదుపులో ఉన్నారు.కాగా, పిల్లలను హతమార్చింది తానేనని రజని అంగీకరించిందని, ఆమె భర్తపై కూడా పలు ఆరోపణలు చేసిందని పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, రజని మానసిక స్థితిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube