తమిళ నాట ఎన్నికల నగారా మోగింది.అధికార పీఠం కాపాడుకోవడం కోసం ఒక పక్క జయలలిత మరొక పక్క మార్పు మేము తీసుకొస్తాం అంటూ అన్నా డీఎంకే పార్టీ హోరా హోరీ గా రంగంలోకి దిగాయి.
ఎన్నికల గంట మొగడానికి ముందరే తగినన్ని పథకాలు ప్రకటించేసిన జయలలిత తన బలాన్ని చాటుకోవడం కోసం కొత్త కొత్త పథకాలు అమలు చేస్తాం అని మాట ఇస్తున్నారు.ప్రజాదరణ చూరగొనడం లో జయకి పెట్టింది పేరు.
అయితే ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే పొలిటికల్ పార్టీలు ఏవైనా గానీ ర్యాలీ లకి హాజరు అయిన వారికి తలా వెయ్యి , కేవలం కూర్చుని పొలిటికల్ కార్యక్రమాల్లో చప్పట్లు కొడితే తలా అయిదొందలూ ఇచ్చేస్తున్నారు.ఇలా దాదాపు 25 మందిని పోగేసి తీసుకుని రాగలిగితే వారికి 2500 సమర్పిస్తున్నారు.
కొన్ని గంటల పాటు ఊరికే కూర్చోవడం ర్యాలీలో కొంత దూరం నడిస్తేనే వందలాది రూపాయలు ఇస్తామని చెబుతుండడంతో అక్కడ ఇళ్లలో ఖాళీగా ఉండే మహిళలకు యమా గిరాకీ పెరిగిందట.ఇక కూలీ పనులకు వెళ్లే వారు కూడా పనులు మానేసి ప్రచారం బాట పడుతుండటం విశేషం.







