గత రెండు సంవత్సరాలుగా ఎన్టీఆర్ అలరించినట్టుగా మరే హీరో అలరించలేదేమో.సిక్స్ ప్యాక్ బాడి, స్పైక్స్ హెయిర్ స్టయిల్ తో ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచాడు టెంపర్ లో.
ఇక ఆ చిత్రంలో ఎన్టీఆర్ నటన కూడా తన మిగితా చిత్రాలకి భిన్నంగా ఉంటుంది.అప్పుడే ఏం చూసారు అన్నట్టు .నాన్నకు ప్రేమతో చిత్రంలో అసలు ఇంతవరకు ఏ తెలుగు హీరో కనిపించనంత స్టయిలిష్ గా కనిపించాడు.అసలు ఒక మాస్ హీరో కి ఈ గెటప్ ఏంటి .ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది ఎన్టీఆర్ కి అని అంతా చర్చించుకున్నారు.అంత పెద్ద మాస్ హీరో అయ్యుండి, చాలా క్లాస్ గా నటించాడు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంలో.
ఇప్పుడు మరొక సరికొత్త లుక్ తో ఎన్టీఆర్ కనిపించనున్నాడని సమాచారం.జనతా గ్యారేజ్ లో ఇంతవరకు ఎన్టీఆర్ ని ఎవరు చూపించనట్టుగా, చూపెడతాడటా కొరటాల శివ.అందరిని సర్ప్రైజ్ చేద్దామనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.సినిమాలో ఎన్టీఆర్ లుక్ బయటకి తెలియకుండా చూసుకుంటున్నారు యూనిట్ మెంబర్స్.
ఇకా తాజా సమాచారం ఏంటంటే, ఎన్టీఆర్ కొత్త లుక్ ఏప్రిల్ లో బయటకు వచ్చేస్తుంది.ఏప్రిల్ 25న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసే యోచనలో కొరటాల శివ ఉన్నట్లు తెలుస్తోంది.
నందమూరి అభిమానులకి ఇది నిజంగా తీపివార్తే.
కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.జనతా గ్యారేజ్ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకి రానుంది.







