నేను మరొక పార్టీ కి మారుతున్నాను అన్న ఊహగానాలకి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టేయండి అంటున్నారు రాజ్య సభ సభ్యుడు చిరంజీవి.తాను రాజకీయాలలో ఉన్నంత కాలం కాంగ్రెస్ లో మాత్రమే ఉంటాను అని ఆయన ఇవాళ మీడియా తో చెప్పారు.
టైం పాస్ కోసం కూడా ఎనిమిది సంవత్సరాల్లో ఒక్క సినిమా కూడా చెయ్యని చిరంజీవి ఇప్పుడు రాజకీయ నాయకుడికీ – హీరో కీ మధ్య స్థానం లో కొనసాగుతున్నారు.ఇక, చిరంజీవి పార్టీ మారతారంటూ ఎప్పటినుంచో ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
జనసేనలోకి వెళ్ళి, తమ్ముడి డైరెక్షన్‌లో అన్నయ్య పని చేస్తారనీ, మొత్తంగా పార్టీ బాధ్యతలు చిరంజీవి చేపడ్తారనీ ఆ మధ్య ప్రచారం జరిగింది.మరోపక్క, చిరంజీవికి వైఎస్ జగన్ ఆఫర్ ఇచ్చారనీ, వైఎస్సార్సీపీలోకి చిరంజీవి వెళ్ళడం ఖాయమనీ ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
కాదు కాదు, తమ్ముడి డైరెక్షన్‌లో అన్నయ్య భారతీయ జనతా పార్టీ వైపు అడుగులేస్తారనే గాసిప్స్‌కూడా తెరపైకొస్తున్నాయి.వీటి గురించి నేరుగా మీడియా అడగడం తో సారు ఇలా సెలవిచ్చారు.







