ఊపిరి టీజర్ విడుదల

నాగార్జున - కార్తి - తమన్నా నటించిన ఊపిరి టీజర్ ఇందాకే విడుదలైంది.ఈరోజు 4:00 గంటల సమయంలోనే విడుదల కావాల్సి ఉన్నా టెక్నికల్ సమస్యల వలన కాస్త ఆలస్యంగా వచ్చింది టీజర్.

లేట్ అయితే అయ్యింది కాని అద్భుతంగా ఉంది టీజర్.

పీ.ఎస్ వినోద్ అందిచిన కెమెరా వర్క్ అత్యద్భుతం.ప్రతి ఫ్రేమ్ అందంగా అనిపించింది.

గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా వినసొంపుగా ఉంది.అసలు ఈ సినిమా తీస్తున్నది వంశీ పైడిపల్లెనా అనేంత ఆశ్చర్యపొవాల్సిందే ఆ టేకింగ్ చూసి.

ఒక మాస్ డైరెక్టర్లో ఇంత క్లాస్ టచ్ నిజంగా అద్భుతం.

Advertisement

ఇక ముగ్గరికి ముగ్గురు ఎంత మంచి నటులో చెప్పనక్కరలేదు లేదు.

నాగార్జున, కార్తి, తమన్నా .అంతా తమతమ పాత్రలలో సెట్ అయినట్టున్నారు.ఇక వెండితెరపై ఈ మల్టిస్టారర్ ని చూసి తరించాల్సిందే.

మార్చి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

To Watch Oopiri Teaser .

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు