‘ హను రాఘవాపూడి ‘ నిన్నటి నుంచీ ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది.కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా డైరెక్టర్ గా హిట్ కొట్టి అందరి నోళ్ళలో నానుతున్న ఈ కుర్ర డైరెక్టర్ , అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరమీద కాలు పెట్టాడు .
ఆ సినిమా చూసిన వెంటనే అందరూ ఇతను ప్రేమ కథలలో ఎక్స్ పర్ట్ అని చెప్పేశారు.మొత్తానికి నిన్న తన రెండవ సినిమాతో మంచి టాక్ తెచ్చుకున్న మనోడు ఈ సినిమాలో అన్నీ జోప్పించేసాడు.
ప్రేమ – ఫ్యాక్షనిజం – మాఫియా – అడ్వెంచర్… ఇలా అన్ని ఓ గాథలో కూర్చేశాడు.థియేటర్ నుంచి బయటికొచ్చేశాక తాము ఎలాంటి సినిమాని చూశామో అర్థం కాక ప్రేక్షకులు కాసేపు ఆలోచనల్లోకి వెళ్లిపోతారు.
హను తన దగ్గర ఉన్న కథలన్నీ ఒక సినిమా కోసమే వాడేసినట్టు అనిపిస్తుంది.కానీ ఇన్ని కథలున్నా ఎక్కడా గందరగోళానికి గురికాకుండా ప్రేక్షకుల్ని తికమక పెట్టకుండా సినిమాని డీల్ చేశాడు హను.ఆ విషయంలో ఆయనకి వందకి వంద మార్కులేయాల్సిందే.







