కాపు ఉద్యమం మీద సినిమా టైటిల్ ' ప్రజా గర్జన'

సొసైటీ ఏదైనా హాట్ టాపిక్ నడుస్తూ ఉంటె , దాని మీద సినిమాలు తీయడానికి డైరెక్టర్ లు చాలా సిద్దంగా ఉంటారు.రాం గోపాల్ వర్మకి ఈ విషయం వెన్నతో పెట్టిన విద్య.

 Movie On Kapu Garjana-TeluguStop.com

సంఘం లో కనపడిన విషయాన్ని అల్లా సినిమా తీసేయడం రామూ కి బాగా అలవాటైన విశేషం.వంగవీటి రంగా జీవిత విశేషాల్ని తెరకి ఎక్కిస్తున్నాడు వర్మ.

ఇప్పుడు అదే పంథా లో గత మూడు వారాలుగా ఏపీ స్టేట్ లో సాగుతున్న కాపు ఘర్జన విశేషాలని సినిమాగా తీయబోతున్నాము అంటూ ఒక డైరెక్టర్ ప్రకటించాడు.కాపు ఉద్యమం మీదే ఏపీ నాయుడు అనే మరో వ్యక్తి ‘ప్రజా గర్జన’ పేరుతో ఓ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు.

ముద్రగడ అండ్ కో చేస్తున్న ఉద్యమం నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు నాయుడు.ఆంధ్రప్రదేశ్ జనాభాలో 30 శాతం ఉన్న కాపుల్ని ప్రభుత్వం ఎలా అణగదొక్కుతోందో.

కాపులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తామని అంటున్నాడు నాయుడు.

ప్రాథమిక హక్కుల కోసం పోరాడటం కూడా ఒక హక్కే అనే నినాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఆయన ప్రకటించాడు.

ఇప్పటికే ముద్రగడ ఆందోళన నేపథ్యంలో ‘జయహో ముద్రగడ’ పేరుతో ఓ పాట కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇప్పుడిక కాపు ఉద్యమంపై సినిమానే తెరకెక్కబోతుండటం విశేషమే.

ఈ చిత్రంలో కొందరు కాపు నేతలు కూడా కనిపిస్తారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube