మెదక్ ఉప ఎన్నికల్లో, వరంగల్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించింది కెసిఆర్ పార్టీ , నిన్నటికి నిన్న విడుదల అయిన గ్రేటర్ ఫలితాలు గులాబీ పార్టీ ని కొత్త సునామీ గా చూపించాయి.ఈ ఫలితాలు గులాబీ శ్రేణుల్లో చాలా పెద్ద పండగ వాతావరణాన్ని సృష్టించాయి.
ఉప ఎన్నికలకి వెళ్ళడం కోసం తెరాస ఇప్పుడు సమాయత్తం అవుతూ ఉంది అంటున్నారు.
గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి.
ప్రస్తుతం నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టనుంది గులాబీ దళం.ఇప్పటికే మంత్రి హరీష్‌రావు నారాయణ్‌ఖేడ్ ఎన్నికల బాధ్యతను భుజానికెత్తుకుని, విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోన్న విషయం విదితమే.పార్టీ శ్రేణులు మొత్తంగా నారాయణ్‌ఖేడ్‌పై ఫోకస్ పెట్టనున్నారు రానున్న రోజుల్లో.ఆ తర్వాత మరో ఉప ఎన్నికల జాతరకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణా లో ఇతర పార్టీల నుంచి తెరాస లోకి భారీగా వలసలు ఏర్పడ్డాయి, గ్రేటర్ హైదరాబాద్ పరిథి లో చాలా మంది ప్రజా ప్రతినిథులు తెరాస లో చేరిపోయారు ఎప్పుడో.మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారావు, సాయన్న.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వలస నేతలే.వీరిలో కొందరితో తొలి విడతలో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాలని కెసిఆర్ భావిస్తున్నారట.
ఇప్పుడు ఉన్న ఊపు మీదనే ఇది జరిగిపోతే ఓటర్లు తమవైపే మొగ్గు చూపుతారు అని అనుకుంటున్నారట ఆయన.







