ఎప్రిల్ లో సినిమా విడుదల చేయడం అనేది అల్లు అర్జున్ కి సెంటిమెంట్ లా మారింది.ఏప్రిల్ లోనే వచ్చిన రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి బన్ని కెరీర్ లో టాప్-2 చిత్రాలుగా నిలువడంతో ఏప్రిల్ ని పట్టుకొని కూర్చున్నాడు.
అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఇప్పుడు సరైనోడు ని కూడా ఏప్రిల్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అంతా బాగానే ఉంది కాని బన్నిది ఆత్మవిశ్వాసమో లేక అతివిశ్వాసమో అర్థం కావట్లేదు.
ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.న్యాయంగా మాట్లాడితే అందరికన్నా ముందు ఆ డేట్ ని అనుకుంది బన్నియే.
కాని ఇప్పుడు పవన్ కళ్యాన్ బరిలో ఉండగా ఏప్రిల్ 8నే రావడానికి బన్ని సాహసిస్తాడా అంటే అనుమానమే.ఏప్రిల్ 29న బ్రహ్మోత్సవం ఉంది.
మహేష్ బాబుతో పోటికి దిగడానికి కూడా బన్ని సాహసించకపోవచ్చు.ఏప్రిల్ ని పవన్ మొదలుపెడితే, మహేష్ ముగించేస్తున్నాడు.
మరి బన్ని ఏం చేయాలి ? వస్తే గిస్తే రెండిటి మధ్యలో రావాలి.
సర్దార్ కి టాక్ వస్తే సరైనోడు ఓపెనింగ్స్ దెబ్బ తింటాయి.
బ్రహ్మోత్సవం కి టాక్ వస్తే సరైనోడు లాంగ్ రన్ లో ఇబ్బందులు చూడాల్సి వస్తుంది.ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో.బన్ని ఇద్దర్ని గెలిచి సరైనోడు అనిపించుకుంటాడా లేక ఇద్దరి మధ్యలో నలిగిపోతాడా ?
.






