ఆ హీరోయిన్ తో సంబంధం ఇంకా అలాగే ఉంది

అది 1999.అప్పటికి బాలివుడ్ చాకొలేట్ బాయ్ రణబీర్ కపూర్ ఇంకా హీరో కాలేదు.

 Ranbir’s Rapport With Aishwarya Is Still The Same-TeluguStop.com

తన తండ్రి దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్ నటిస్తున్న “ఆ అబ్ లౌట్ చలే” అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.అప్పుడు ఐశ్వర్య రణబీర్ తో స్నేహంగా మాట్లాడేదట.

తానూ ప్రపంచసుందరి, హీరోయిన్ అనే భావన రణబీర్ కి ఎప్పుడు కలగలేదట.అంత స్నేహంగా ఉండేదట ఐష్.

ఇప్పుడు పదిహేను సంవత్సరాల తరువాత ఐశ్వర్యతో కలిసి ” ఏ దిల్ హై ముష్కిల్” అనే సినిమాలో నటిస్తున్నాడు రణబీర్.అప్పటికి ఇప్పటికి ఐశ్వర్యలో ఏమైనా మార్పు వచ్చిందా అని రణబీర్ ని అడిగితే ” నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పటి నుంచి ఐశ్వర్యతో కలిసి నటించడం నా కల.కేవలం తన అందాన్ని చూసి నేను ఇష్టం పెంచుకోలేదు, నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా నాతొ స్నేహంగా ఉండేది.తన ప్రవర్తన నన్ను ఓ అభిమానిని చేసింది.

మొత్తానికి ఆవిడతో నటిస్తున్నాను.అప్పటికి ఇప్పటికి ఏ మార్పు లేదు.

ఐశ్వర్య అంటే ఒక లెజెండ్.కాని ఇప్పటికి నేను ఏదైనా మాట్లాడగలను ఆవిడతో.

ఆ స్నేహం అలానే ఉంది.మా బంధం అలానే ఉంది.

ఏం మారలేదు ” అంటూ చెప్పుకొచ్చాడు రణబీర్.

కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న “ఏ దిల్ హై ముష్కిల్” ఒక ముక్కోణపు ప్రేమకథ.

రణబీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ ఇందులో ప్రధానపాత్రదారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube