చరణ్‌ భలే భలే చిత్రం..!

‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రంతో దర్శకుడు మారుతి ఒక్కసారిగా స్టార్‌ దర్శకుడు అయ్యాడు.ఈయన తనపై ఉన్న బూతు చిత్రాల దర్శకుడు అనే బ్రాండ్‌ను ఆ సినిమాతో పోగొట్టుకున్నాడు.

 Ram Charan Under Maruthi Direction-TeluguStop.com

ప్రస్తుతం మారుతి టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడు.ఈయన దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా ‘బాబు బంగారం’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా తర్వాత తాను మెగా హీరోతో సినిమా చేయబోతున్నాను అంటూ ఆ మధ్య మారుతి చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చరణ్‌తో మారుతి సినిమా చేసే అవకాశాలున్నాయి.

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు.తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘తని ఒరువన్‌’ రీమేక్‌లో చరణ్‌ నటించబోతున్నాడు.

ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చరణ్‌ నటిస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఎన్టీఆర్‌, కొరటాల శివ సినిమా పూర్తి అయిన తర్వాత చరణ్‌, కొరటాల శివ సినిమా ప్రారంభం అవ్వనుంది.

ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో సినిమా ఉంటుందనే సమాచారం ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.మరో వైపు మారుతి దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఒక సినిమా తెరకెక్కే అంశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube