టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు అంటే తనకు జలసి అంటూ ప్రముఖ దర్శకుడు సుకుమార్ అంటున్నాడు.తాజాగా ఈయన ‘నాన్నకు ప్రేమతో’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకున్నాడు.
మరో స్టార్ హీరోతో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు.ఈ క్రమంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక విషయంలో మహేష్‌తో పోల్చుకుంటే తనకు అంతులేని బాధ కలుగుతుందని, కాని ఆయనలా తాను ఉండలేక పోతున్నాను అంటూ సుకుమార్ చెప్పుకొచ్చాడు.
ఇంతకు ఏ విషయంలో అని అనుకుంటున్నారా.కుటుంబ వ్యవహారాల విషయంలో, పిల్లలతో గడిపేందుకు మహేష్ కేటాయించే సమయంలో.
స్టార్ హీరో అయినా కూడా మహేష్‌బాబు తన కుటుంబం కోసం అంటూ ప్రత్యేకంగా కొన్ని రోజులు కేటాయిస్తాడు.సినిమాలు, యాడ్స్‌తో బిజీ బిజీగా ఉన్నా కూడా తన పిల్లలు కోరుకున్నట్లుగా వారితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
అతి తక్కువ మంది సినిమా సెలబ్రెటీలు మాత్రమే ఇలా పిల్లల కోసం సమయాన్ని కేటాయిస్తారు.అందులో మహేష్ ఒక్కడు.
కాని సుకుమార్ మాత్రం తన కుటుంబం కోసం కనీసం సమయం కూడా కేటాయించలేక పోతున్నాడట.ఎప్పుడు కూడా బిజీ వర్క్‌తో ఉండటం వల్ల పిల్లలతో గడిపే అవకాశమే లేకుండా పోతుందని సుకుమార్ బాధ పడుతున్నాడు.
స్టార్ డమ్ వచ్చినప్పుడు ఇవన్ని తప్పవని కొందరు సుకుమార్‌ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.







