క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం తర్వాత మరో సినిమాను చేసింది లేదు.అప్పటి నుండి కూడా ఈయన తన తర్వాత సినిమాకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి.
కాని ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.భారీ బడ్జెట్ హర్రర్ చిత్రంగా కృష్ణవంశీ తన తర్వాత సినిమాను రూపొందించబోతున్నాడు అంటూ అప్పుడప్పుడు సినీ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.
మొదట ఈ చిత్రంలో అనుష్కను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగింది.
ఇప్పుడు మరో హీరోయిన్‌ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.
‘రుద్రక్ష’ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్‌లు మరియు ముగ్గురు హీరోలు కనిపించబోతున్నారు.
ముగ్గురు హీరోయిన్స్‌లలో అనుష్క, సమంతలు ఇప్పటికే ఎంపిక కాగా మరో హీరోయిన్ పాత్రకు రమ్యకృష్ణను కృష్ణవంశీ ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.కథానుసారంగా తన భార్య రమ్యకృష్ణ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆమెను కృష్ణవంశీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక త్వరలోనే హీరోల ఎంపిక చేసే అవకాశాలున్నాయి.ఆ తర్వాత స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నారు.
భారీ అంచనాలున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంలో కూడా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో కృష్ణవంశీ ఉన్నాడు.







