యంగ్ హీరో సుధీర్ బాబు లేనిపోని ఇరకాటంలో ఇరుక్కున్నాడు.జీతెలుగులో వచ్చే ఒక చాట్ షోలో పాల్గొన్న సుధీర్ అనుకోని విధంగా ఇబ్బందుల్లో పడ్డాడు.దానికి కారణం మహేష్ – పవన్ అభిమానుల నెం.1 గొడవలే.అసలేం జరిగిందో తెలియాలంటే విషయం పూర్తిగా చదవండి.
మహేష్ – పవన్ లలో నెం.1 ఎవరు అంటే ఏం చెప్తాం ? చాలా కష్టమైన ప్రశ్న.గబ్బర్ సింగ్ వచ్చేదాకా మహేష్ పవన్ కి చాలా ఎత్తులో ఉన్నాడు.
పోటాపోటిగా ఇద్దరు తలబడుతున్న తరుణంలో మహేష్ కి 1-నేనొక్కడినే, ఆగడు రూపంలో రెండు భారి డిజాస్టర్స్ వస్తే, పవన్ కి అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ దొరికింది.దాంతో పవన్ వైపు గాలి మళ్ళినా, శ్రీమంతుడుతో లెక్క సరిచేసాడు సూపర్ స్టార్.
ఇద్దరి మార్కెట్ ఒకే రేంజ్ లో ఉంటుంది.కొన్ని ఏరియాలు పవన్ డామినేట్ చేస్తాడు,కొన్ని ఏరియాలు మహేష్ డామినేట్ చేస్తాడు.
ట్రేడ్ వర్గాలే ఎటు తెల్చుకోలేకపోతున్నాయి.కాని ఎవరి సన్నిహితులకి వాళ్ళే నెం.1.ఎవరి అభిమానులకి వాళ్ళే నెం.1.కాని మహేష్ కి స్వయంగా బావ అయిన సుధీర్ బాబే పవన్ కళ్యాన్ నెం.1 అంటే ?
సరిగ్గా ఇదే చూపించారు ఆ ప్రోగ్రాం తాలూకు ప్రోమోలో.దాంతో ఎప్పటిలాగే అభిమానుల మధ్య గొడవ మొదలైంది.సుధీర్ బాబు పవన్ ని నెం.1 అన్నాడంటూ పవన్ ఫ్యాన్స్ రెచ్చగొడితే, స్వయంగా చిరంజీవే తన స్థానం మహేష్ దే అన్నాడు అంటూ మహేష్ ఫ్యాన్స్ రచ్చ చేసారు.ఇంతలో అసలు విషయం బయటపెట్టాడు సుధీర్ బాబు.
తన దృష్టిలో నెం.1 మహేష్ బాబే అని, ఆ ప్రోగ్రాం వాళ్ళు దాన్ని ఇంకో రకంగా ఎడిట్ చేయడం వల్ల ఈ మనస్పర్ధలు వచ్చాయని.తనని అడిగిన ప్రశ్న వేరు, చెప్పిన సమాధానం వేరు అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లారిటి ఇచ్చాడు సుధీర్.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు మహేష్ అభిమానులు.







