నెల్లూరు కి ఎయిర్ పోర్ట్ ఒచ్చేస్తోంది అహో !!

నెల్లూరు కి విమాన కల , కళ కి సర్వం సిద్దం అవుతోంది.అన్ని అవసరాలకూ తగ్గట్టుగా నెల్లూరుకి అతి దగ్గర లో ఒక విమానాశ్రయం ఏర్పాటు చెయ్యడం కోసం ఏపీ సర్కారు తన పనులు షురూ చేస్తోంది.?

 Nellore Airport Is Coming-TeluguStop.com

నెల్లూరు కీ కావలి కీ దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం లో ఉన్న దామవరం – వెలుపోడు , కౌరగుంట ఇలాంటి గ్రామాల మధ్యలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ని సిద్దం చెయ్యాలని నిర్ణయం జరిగింది.దీనికోసం దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాలు సేకరించ బోతున్నారు కూడా మూడొందల కోట్ల తో నిర్మితం అయిన ఈ ఎయిర్ పోర్ట్ తాజాగా నూట డభై కోట్ల ఖర్చు అవుతుంది.

ఈ మొత్తాన్నీ కూడా ప్రభుత్వం విడుదల చేసేసినట్టు చెబుతున్నారు.అయితే.కార్యరూపం దాల్చింది లేదు.

చంద్రబాబు సర్కారు ఏర్పాటు అయిన తర్వాత.

నెల్లూరుకు ఎయిర్ పోర్ట్ డిమాండ్ పై సానుకూల స్పందనలు షురూ అయ్యాయి.ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల అంశాల్ని పరిశీలించిన మీదట.

ఏర్పాటు కష్టం కాదన్న విషయాన్ని తేల్చారు.ఇందుకోసం నిపుణుల బృందం పలు దఫాలు పర్యటించింది.

నెల్లూరుకు ఎయిర్ పోర్ట్ వచ్చేస్తే.దానికి మాంచి ఆదరణ ఉంటుందన్న భావన ఉంది.

ఎందుకంటే.నెల్లూరు.చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారు నిత్యం ఎయిర్ పోర్ట్ కోసం 165 కిలోమీటర్ల దూరం ఉన్న చెన్నైకి కానీ.150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణిగుంట విమానాశ్రయానికి తరలి వెళుతున్నారు.

నెల్లూరులో ఎయిర్ పోర్ట్ సాకారమైతే.ఈ దూరాభారం భారీగా తగ్గిపోనుంది.ఎయిర్ పోర్ట్ కు అవసరమై భూముల్ని గిర్తించే పనిలో ఉన్న సర్కారు.వీలైనంత త్వరగా ఎయిర్ పోర్టు పనుల్ని ప్రారంభించాలన్న భావనలో ఉంది.

చూస్తుంటే సమీప భవిష్యత్తులోనే సింహపురికి విమానాశ్రయ శోభ కలుగనుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube