తాత్కాలిక సచివాలయం కోసం అంటూ ఏపీ ప్రభుత్వం ఆ మధ్యనే నూట ఎనభై కోట్లు వెచ్చించింది.దీనికోసం జీ ప్లస్ వన్ కేటగిరీ ప్రకటించి మరీ టెండర్లు పిలిచారు మంత్రి నారాయణ.
త్వరగా టెండర్ లు పిలిచి టెండర్ లు పూర్తి చేస్తాం అని ప్రకటించేసారు.తూళ్ళూరు కి దగ్గర లో ఉన్న వెలగపూడి ని తాత్కాలిక సచివాలయం కోసం కేటాయించారు.
దాదాపు ఇరవై ఆరు ఎకరాలు దీనికోసం తీసుకున్నారు నూట ఎనభై కోట్ల ఖర్చు తో నిర్మాణం కావాల్సి ఉంది.కానీ చంద్రబాబు సర్కారు లెక్కలు చాలా తేడాగా కనిపిస్తున్నాయి.
2018 చివర్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలి దశ నిర్మాణం కానుంది.అప్పటిదాకా ఈ తాత్కాలిక సచివాలయమే సేవలందించనుందన్నమాట.ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, తాత్కాలిక సచివాలయ నిర్మాణానికే ఆరు నెలల సమయం పడితే, శాశ్వత సచివాలయ నిర్మాణానికి ఇంకెంత సమయం పడ్తుంది.? లాజిక్కే కదా.రెండు మూడేళ్ళలో పూర్తిస్థాయి సచివాలయం పూర్తయ్యే అవకాశాలైతే ప్రస్తుతానికి కన్పించడంలేదు.ఆ లెక్కన, తాత్కాలిక సచివాలయం.
మూడేళ్ళకు మించి, ఐదేళ్ళ దాకా సేవలు అందించాల్సి రావొచ్చు.ఇందులో ఇంకో మాటకు తావులేదు.
గన్నవరం దగ్గర లోని మేధా టవర్స్ ని సచివలయంగా మార్చే ప్రయత్నాలు కూడా జరిగినా తరవాత ఒద్దు అనుకున్నారు.
ఆల్రెడీ నిర్మితమైన శాశ్వత భవనంలో తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేసుకుని వుంటే, మూడేళ్ళేం ఖర్మ.
ఐదేళ్ళేం ఖర్మ.కొత్త రాజధాని పూర్తిస్థాయిలో తయారయ్యేదాకా వినియోగించుకోవచ్చు.
ఇంత బెస్ట్ ఆప్షన్‌ని చంద్రబాబు సర్కార్ పక్కన పడేయడం ఆశ్చర్యం కలిగించే అంశమే.ఖర్చు తగ్గించుకోవాల్సిన ప్రభుత్వం పని గట్టుకుని నూట ఎనభై కోట్లు పెట్టుబడి పెడుతోంది.







